UP: ఇదేం విడ్డూరం! మొరిగిన కుక్క.. ఆగిన పెళ్లి!
- ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన
- ఆచారాల సమయంలో మొరిగిన కుక్క
- రక్తం చిందేలా కొట్టుకున్న బంధువులు
- అర్ధాంతరంగా నిలిచిపోయిన పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది. పెంపుడు కుక్క కారణంగా అర్ధాంతరంగా పెళ్లి పీటల మీద వివాహం ఆగిపోయింది. పెళ్లి వేడుక కాస్త రణరంగం మారి రక్తపాతం చిందించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే…!
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని వివాహ మండపంలో పెళ్లి జరుగుతోంది. ఖాగా కొత్వాలి ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో జరుగుతోంది. బుధవారం రాత్రి చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు జరిగాయి. వధువు తరపు వారు ప్రయాగ్‌రాజ్ నుంచి విమానంలో చేరుకున్నారు. వరుడి తరపు వారు చాలా గ్రాండ్‌గా ఊరేగింపుతో మండపానికి తీసుకొచ్చారు. ప్రారంభం అంతా ప్రశాంతంగా వేడుకలు జరుగుతున్నాయి. జైమాల వేడుక కూడా చాలా సంతోషంగా పూర్తైంది. ఇరు కుటుంబాలు ఆనందోత్సహాలతో సాగిపోతున్నారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?

ఇక తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ముహూర్తానికి పెళ్లి జరగాల్సి ఉంది. ఆ సమయంలో నగలు సమర్పించే ఆచారం జరుగుతోంది. ఇంతలో మండపానికి సమీపంలో కట్టి ఉంచిన వధువుకు సంబంధించిన పెంపుడు కుక్క మొరగడం ప్రారంభించింది. దీంతో వరుడి కుటుంబానికి చెందిన యువకుడు ఆవేశంలో కొట్టడంతో కుక్క చచ్చిపోయింది. అంతే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అప్పటిదాకా ఉల్లాసంగా… ఉత్సాహం సాగిన వేడుక కాస్త రణరంగంగా మారిపోయింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు కర్రలు, కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో వధువుకు సంబంధించిన ముగ్గురు బంధువులు, వరుడికి సంబంధించిన ఇద్దరు బంధువులు గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
ఈ కొట్లాట జరుగుతుండగా ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటినా మండపానికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింప జేశారు. కానీ ఈ పరిణామంతో వధువు తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో అంతా షాక్ అయ్యారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో కట్నకానులు తిరిగి ఇచ్చి పుచ్చుకునేందుకు ఒప్పందం కుదరడంతో పంచాయితీ సద్దుమణిగింది. అనంతరం ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు.
వరుడు మాట్లాడుతూ.. చాలా రోజులుగా ప్రేమలో ఉన్నామని.. తల్లిదండ్రులను వదిలి అమ్మాయి మా ఇంటికి వచ్చిందని తెలిపాడు. కాన్పూర్ ఆర్య సమాజ్‌లో వివాహం కూడా చేసుకున్నామని వెల్లడించాడు. అమ్మాయి బంధువులు వివాహం చేస్తామని హామీ ఇవ్వడంతో తాము గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పాడు. దండల కార్యక్రమం కూడా సజావుగా సాగిందని.. తెల్లవారుజామున వివాహ ఆచారాల సమయంలో కుక్కను చంపడంతో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నాడు. పెళ్లి వద్దంటూ అమ్మాయి ప్రయాగ్‌రాజ్ వెళ్లిపోయిందని చెప్పాడు.
ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం
- Tags
- bride
- groom
- Pet Dog
- UP
- Wedding stopped
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి