ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపార నిర్వాహకులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు.
యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ చాలా తెలివిగా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చారు. రెండు దేశాలలో నివసించడానికి, పని చేయడానికి యువ బ్రిటీష్, భారతీయ నిపుణుల కోసం కొత్త మార్పిడి పథకాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం రావడంతో గురువారం ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకింది. దీంతో కాలిఫోర్నియాలో భారీహా మంచు కురుస్తోంది. మంచు భారీగా కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ముంబైలోని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయటి గోడను దూకి మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు.
కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి.
ఒక రోజు క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత సుమారు రూ. 6 కోట్ల విలువైన నగదు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆసీస్ జట్టు మూడో టెస్టులో భారత్‌పై ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్‌ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్‌లను పొందారు.