అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలు ఎగ్గొట్టేందుకు యువకుడు ఆడిన కిడ్నాప్ డ్రామాకు బాలాపూర్ పోలీసులు తెరదించారు. లక్ష రూపాయలను ఎగ్గొట్టేందుకు పెదనాన్నను మోసం చేయబోయాడు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఉపన్యాసం సందర్భంగా కేంద్రంపై ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్‌లోకి స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని ఆరోపించారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు.
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది.
రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేయడాన్ని అమెరికా పరిశీలిస్తోందని, ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుందని, తీవ్రపరిణామాలు ఉంటాయని యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు.
ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే బుక్ రిలీజ్ చేసిందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైజాగ్‌లో రేపు సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఫాల్స్ బుక్ లెట్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహా సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు.ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చల్లో భాగంగా బొత్స నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులు వచ్చారు.