Sajjala Ramakrishna Reddy: మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు. అమ్మఒడితో పిల్లల తల్లులకు ధైర్యం నింపారన్నారు.పేదరికంతో విద్యకు దూరం అవ్వకూడదు అని భావించే ముఖ్యమంత్రి.. జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రస్తావించారు. మనం బాగుండటం కాదు ,మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలన్నారు.
Read Also: BJP: జాతీయ పార్టీల నిధుల్లో సగానికి పైగా బీజేపీకే.. వెల్లడించిన ఎన్నికల సంఘం..
మంచి పని ఒక యజ్ఞంలా చేయాలన్న ఆయన.. అప్పుడే వ్యవస్థలు బాగుపడతాయన్నారు. పేద పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న స్కూల్స్‌లో జరుగుతున్న అభివృద్ధి స్ఫూర్తిదాయకమన్నారు. సమాజం కోసం మన వంతు ఏం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలన్నారు. రాజకీయాల్లో, అధికారంలో ఎవరు ఉన్నా విద్యా, వైద్యంకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.