Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
- టీ20 ప్రపంచకప్ 2026లో ముగిసిన లీగ్ దశ
- ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 ఆరంభం
- సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 T20 WC Super 8 Team Rankings: టీ20 ప్రపంచకప్ 2026లో లీగ్ దశ ముగిసింది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సూపర్-8కు చేరాయి. మ్యాచులు శనివారం (ఫిబ్రవరి 21) నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8కు చేరిన జట్లపై అభిమానులు, నిపుణులు తమ తమ అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ విశ్లేషణ ప్రకారం.. లీగ్ రౌండ్ దశ ప్రదర్శన ఆధారంగా జట్ల ర్యాంకింగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో జింబాబ్వే నిలవడం విశేషం. ఎవరూ ఊహించని విధంగా వారు బలమైన ఆస్ట్రేలియాను, ఆతిథ్య శ్రీలంకను ఓడించడం ఆ జట్టు ప్రతిభకు నిదర్శనంగా భావిస్తున్నారు.
రెండో స్థానంలో వెస్టిండీస్, మూడో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి. నాలుగో స్థానంలో భారత్ ఉంది. భారత జట్టు బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, శివమ్ దూబే తప్ప మిగతా బ్యాటర్లు స్థిరంగా రాణించలేదని అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సూపర్-8లో భారత్ ప్రధాన ఫేవరెట్‌గా నిలుస్తుందని కూడా ఈ విశ్లేషణ చెబుతోంది. ఐదో స్థానంలో న్యూజిలాండ్, ఆరో స్థానంలో శ్రీలంక, ఏడో స్థానంలో ఇంగ్లాండ్ ఉన్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Ambati-Pemmasani: 18 రోజులు సినిమా చూపించావ్ పెమ్మసాని.. తప్పక మూల్యం చెల్లించాల్సిందే!
ఇక చివరి స్థానంలో దాయాది పాకిస్థాన్ నిలిచింది. చిన్న జట్లపై విజయాలు సాధించి.. భారత్‌పై ఘోరంగా ఓడిపోవడం పాక్ ర్యాంక్‌పై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ ర్యాంకింగ్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా జింబాబ్వే అగ్రస్థానంలో ఉండటం, భారత్ నాలుగో స్థానంలో ఉండటం వంటి అంశాలు సూపర్-8 మ్యాచ్‌లపై మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పుడు అసలు పరీక్ష సూపర్-8లోనే ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..