హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ రోజుల్లో చాలామంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, కుర్చీలో కూర్చున్నప్పుడు లేదంటే నిలుచున్నప్పుడు కూడా సడెన్‌గా గుండెపోటుతో క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. శుభకార్యాలు, పెళ్లి వేడుకల్లో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో విషాదం చోటుచేసుకుంది.
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా.. మొదటి రెండునెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకమని.. టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు
అనంతపురం జిల్లా నార్పలలో విషాదం చోటుచేసుకుంది. నార్పల మండల కేంద్రంలోని మెయిన్ బజార్‌లో ఉన్న పెద్దమ్మ సామీ గుడి వద్ద ఉన్న ఓ ఇంటిలో ఆరునెలల బాలుడితో పాటు ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు.
ఆషాడం పోయింది.. శ్రావణం కూడా వెళ్ళిపోయింది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. ఎప్పుడు? ఇంకెప్పుడు? మా ఆశలు నెరవేరేదెప్పుడు? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఇది. అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్టు వెంటనే పదవుల పందేరం ఉంటుందా? ఇంకేవన్నా సాకులు తెర మీదికి వస్తాయా? గాంధీభవన్ వర్గాలు ఏమంటున్నాయి?