CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకమని.. టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఎకరాల భూమి అమరావతిలో పోలీసు మార్టియర్స్ డే కోసం ఇస్తామన్నారు. సైబర్ పోలీసు స్టేషనులు పెడుతున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు..ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ తుళ్ళూరులో పెడతామని చెప్పారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇక్కడకి తీసుకొస్తామన్నారు.
Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌గా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్
ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ (ఈగల్) అని పెట్టామని చంద్రబాబు వెల్లడించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే ముసుగు తీయిస్తామన్నారు. ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ఆటలు సాగనివ్వమన్నారు. అమ్మాయిలపై దాడి చేస్తే అదే చివరి రోజు అనే భయం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.నీచమైన ఆలోచనలు పెరిగిపోయాయన్నారు. డ్రగ్స్ పైన పెద్ద ర్యాలీ చేసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమాజం చైతన్యం అయ్యేలా లా అండ్ ఆర్డర్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ల్యాండ్ గ్రాబింగ్ పైన ఎవరైనా కేసు పెడితే ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి నిరూపించుకోవాలని సీఎం చెప్పారు. ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే బయటకి రారని ఆయన వెల్లడించారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లుంటారని పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టులు పెట్టి ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వారిని శిక్షించడంతో పాటు పరిష్కారం కూడా వెంటనే ఇస్తామన్నారు. చాలా పకడ్బందీగా జిల్లా కలెక్టర్ పర్మిషన్‌తో విచారణ జరుగుతుందన్నారు. డీఎస్పీ కంటే పై స్థాయి అధికారి విచారణ చేస్తారని తెలిపారు. పీడీ యాక్టుకు కూడా పదును పెట్టామన్నారు. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర పీడీ యాక్టులు స్టడీ చేశామన్నారు. సైబర్ క్రైమ్ నేరస్ధులను కూడా పీడీ యాక్టులో చేర్చామన సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.