సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
విజయవాడలోని ప్రముఖ క్షేత్రమైన ఇంద్రీకీలాద్రి ఆలయం వైపు వెళ్లే ఘాట్ రోడ్డును 3 రోజుల పాటు మూసివేశారు. ఇవాళ్టి సాయంత్రం నుంచి ఈ నెల 22 వరకు ఘాట్‌రోడ్డును మూసి ఉంచనున్నారు. కొండరక్షణ చర్యల పనుల్లో భాగంగా ఘాట్‌రోడ్ రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వికలాంగ క్రీడాకారిణికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి ధైర్యం నింపారు. పారా బ్యాడ్మింటన్‌లో వీల్ చైర్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో పడాల రూపాదేవి బంగారు పతకాలు సాధించారు.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో ఇప్పటి వరకూ 391.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు.
సింహాచలం దేవస్థానం ఆలయ భూములు అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ జరగనుంది. త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణ జరపనుంది. కమిటీ సభ్యులను కూడా విజిలెన్స్ అధికారులు విచారించనున్నారు.
సోలార్ పవర్ ప్లాంట్ వద్ద మట్టితోలే అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో మరోమారు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు నిబంధనలు ప్రకారం ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. ఈనెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉన్న సంగతి తెలిసిందే.
కల్వరి టెంపుల్‌ను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్‌కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.