తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును హత్య చేసిన ఆంజనేయ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. హైదరాబాద్‌లో దిగిరానంటున్న టమాటా రేటు.. కర్నూలులో మాత్రం రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. వందకు పైగా పలికిన టమాటా.. ఇప్పుడు రూపాయి కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటను పారబోసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర దారుణంగా పతనమైంది. కిలో రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సైబర్ క్రైంలు, ఛీటింగ్‌లు జరగకుండా కంట్రోల్ చేయాలని.. రెండు టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలన్నారు. రియల్ టైంలో యూజ్ కేసులు తయారు చేసి, సీసీ కెమెరాలపై కంట్రోల్ చేయాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని.. ఇంత పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటం ఇదే మొదటి సారి అని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. మద్యం పైన సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఇసుకపై సీనరేజీ తీసేసిన తరువాత పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరగకూడదన్నారు. ఎంత ఇసుక కావాలో అంతా ఉదయం పూటే దొరుకుతుందన్నారు.
డిసెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు నిరంతర అభివృద్ధి కోసం ఆకాంక్షించే భారతదేశం తరపున ఒక ప్రధాన ప్రకటన అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. అంతకుమించి, మన దేశం 2047 నాటికి 'వికసిత్ భారత్'ను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం స్వాతంత్య్రం పొందిన 100 సంవత్సరాలను జరుపుకుంటున్నప్పుడు ఈ నిర్ణయం, ఈ చారిత్రాత్మక బిల్లు ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తుగా నిలుస్తుందన్నారు.
కూతురి జోలికొస్తే తన కత్తే సమాధానం చెబుతుందని ఓ తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతే కాకుండా పోలీసుల చేతకానితనం వల్లే తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందని అంటున్నాడు.
చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్నపాటి విషయాలకు మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఇనుప తాళాలు మింగిన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగింది.
విశాఖలో వింత ఘటన చోటుచేసుకుంది.. రూ.లక్షా 20 వేలు రూపాయలు పెట్టి కొన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ తరచూ కంప్లైంట్స్ రావడంతో విసిగిపోయాడు ఓ కస్టమర్. ఇంట్లో ఆడవాళ్లు బైక్ తీసినపుడు నడిరోడ్డు మీద ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి నిరసన తెలిపాడు ఓ కస్టమర్.
నాలెడ్జ్ సొసైటీ మన లక్ష్యమని.. ఉన్నత విద్య అంశాలు ఏమిటనేది సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలన్నారు. రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు కూడా అందరూ ముందుకు రావాలన్నారు.