Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
- గత ప్రభుత్వానికి చెత్తను ఉపయోగించి అద్భుతాలు చేయడం తెలియదు
- త్వరలోనే కాకినాడ, నెల్లూరులో చెత్త ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్లాంటు
- మంత్రి నారాయణ వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు. అక్టోబర్ రెండో తేదీకి, రాష్ట్రంలో ఉన్న డంప్ యార్డ్స్‌లో ఉన్న చెత్త మొత్తాన్ని క్లియర్ చేస్తామని మంత్రి తెలిపారు. నగరాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా, ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని, 2014 టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సింగపూర్ తరహా దేశాలు కూడా ఇదేవిధంగా ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. త్వరలోనే కాకినాడ, నెల్లూరులో చెత్త ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు.
Read Also: Maoists: చింతూరు ఏజెన్సీలో మావోల దుశ్చర్య.. కారును దగ్ధం చేసిన మావోయిస్టులు!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కడప -కర్నూలు మధ్యలో కూడా మరొక ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థలాలు అందుబాటులో ఉండటం వల్ల గుంటూరు, విశాఖపట్నంలో శరవేగంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పామన్నారు. ప్లాంటు పెట్టడం వల్ల 50 నుండి 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ఉండే చెత్త మొత్తం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌కు చేరుతుందన్నారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుతుందని.. ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. గుంటూరు సమీపంలో ఉన్న జిందాల్ ఎనర్జీ ప్లాంట్‌కు 6,990 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. చెత్త ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేసే, ప్లాంట్లు భారతదేశం మొత్తం కలిపి 3 ప్లాంట్లు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పట్టణాలు, నగర ప్రాంతాల్లో విస్తరిస్తున్న ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!