వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు.
చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం, జీవక్రియలో మార్పులు, చలి వాతావరణం, తక్కువ పగటి వేళల కారణంగా సౌకర్యవంతమైన ఆహారం తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల శీతాకాలంలో బరువు పెరగడం సాధారణం. చల్లగా ఉన్న సమయంలో మనం కదలకపోవడం వల్ల శరీరం సహజంగా శక్తిని ఆదా చేస్తుంది. అధిక కేలరీలు, వేడిగా ఉండే ఆహారాలను తినాలనే కోరిక పెరుగుతుంది.
అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వం తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో సుమారు 20 మంది చనిపోయారని.. ఆ ఘటనకు ఎవరిని బాధ్యులుగా చేశారని ప్రశ్నించారు.
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నికయ్యారు. ముగ్గురూ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ అని.. ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా.. రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు.
జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటం అక్రమమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఖండించారు. పుష్ప-2 విడుదల సందర్భంగా ఆకస్మికంగా తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గ్రామపెద్దలు
మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ఈ నెల 14న(రేపే) హనుమకొండలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు వరంగల్ పశ్చిమం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తమ చేతుల మీదుగా ముకుంద జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ హాజరు కానున్నారు.
రేపు బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. సీఎం సభ సందర్భంగా బెజవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.