Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకరమైన భాషతో హెచ్చరిస్తూ మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే ఈ బెదిరింపు కాల్స్ అలాగే బెదిరింపు మెసేజ్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పోలీసుల దృష్టికి పేషీ సిబ్బంది తీసుకెళ్లారు. ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
డిప్యూటీ సీఎం పవన్ పేషీకి ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తిరువూరుకి చెందిన నక్కా మల్లిఖార్జున రావుగా గుర్తించారు. బందరు రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి మల్లిఖార్జున రావు కాల్ చేసినట్లు తెలుసుకున్నారు. మల్లికార్జురావును పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు ఫోన్ చేశాడు..ఎవరైనా చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.