Tirupati Rains: అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆరిణియార్ ప్రాజెక్టు నుంచి ఐదువేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. కాళహస్తి నుండి పిచ్చాటూరు వద్ద అరుణానది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Also: Grandhi Srinivas: ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతా..
సీకే పురం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో విద్యార్థులను స్థానికులు వాగు దాటించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కేవీబీ పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌లో 220 అడుగులకు నీరు చేరింది. ఆరు మినీ గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదిలారు. వరదయ్యపాలెం మండలంలోని బీజీఆర్ కాలనీ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. గోవర్ధనపురం సమీపంలో పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చెన్నై వెళ్ళే రహదారిలో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.