Grandhi Srinivas: ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతా..
- భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై
- రాజీనామా లేఖను జగన్‌కు పంపిస్తా..
- ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతానని వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grandhi Srinivas: సార్వత్రిక ఎన్నికలైన తరువాత నుంచి వైసీపీ జగన్‌కు షాక్ లా మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న మాజీ మంత్రి ఆళ్ల నాని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌లు వైసీపీకి బై బై చెబుతూ షాక్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపుతూ రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి, తరువాత 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీలోని ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనేవారు. గత 5 ఏళ్లలో మంత్రి పదవి వస్తుందని ఆశాభావం ఉండేవారని, కానీ మాజీ ఎమ్మెల్యే గ్రంధికి నిరాశనే మిగిలింది. ఇటీవలే జరిగిన ఐటీ రైడ్స్, అధిష్టానం నుంచి కూడా ఎటువంటి సమాధానం లేకపోవడంతో నిరాశ చెందిన ఆయన రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి. అదే రీతిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు.
Read Also: CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్.. మాటలు కాదు.. 3 నెలల్లో అమలు కనిపించాలి
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేరని, అందుకు తగ్గ ఆర్థిక వనరులు ప్రభుత్వం వద్ద లేవని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు అమలు చేయలేరని తెలిసిన ప్రజలు ఆయనకి ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ జగన్ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు సాధ్యం కాదని తెలిసిన వాటిపైన ఉద్యమాలు ఆందోళనలు ఎలా చేయమంటారని అడిగారు. జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కార్యకర్తలకు, నాయకులకు విలువ లేకుండా పోయిందన్నారు. ఏ పార్టీలో చేరాలనేది కుటుంబ సభ్యుల లాంటి కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతానని గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!