Maoists: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో సరివెల వద్ద జాతీయ రహదారి-30పై గ్జైలో(XYLO) కారును పూర్తిగా దగ్ధం చేసారు. ఈనెల 2 నుండి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలు ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే కారు నెంబర్ ప్లేట్ కూడా కనబడకుండా దగ్ధమైంది. చింతూరు వైపు నుండి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు 1గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కారు చత్తిస్ఘడ్ నుండా లేక ఆంధ్రా నుండి వెళ్తుందన్న విషయంపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. దగ్దమైన సమయంలో కారులో ఎంత మంది వ్యక్తులునున్నారు అనే దానిపై సమాచారం లేకపోవడంతో ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు పోలీసులు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనపై చింతూరు ఏజెన్సీ ఉలిక్కిపడింది.
Read Also: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి.. పెళ్లయిన 40 రోజులకే..