South India Shopping Mall: ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుభారంభం
- ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్
- నటీమణి శ్రీలీల చేతుల మీదుగా ప్రారంభం
- అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్
- ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South India Shopping Mall: అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్‌ను కర్నూలు రోడ్, ఒంగోలులో 2024 డిసెంబరు 12న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్‌కుమార్, ఒంగోలు మేయర్ గందాడ సుజాత, ఒంగోలు 48వ డివిజన్ కార్పొరేటర్ వేమూరి భవాని ముఖ్యఅతిథులుగా విచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 38వ షోరూము శుభారంభం చేశారు.
ప్రముఖ తారామణి కుమారి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి, సరికొత్త షోరూమ్‌కు శుభారంభం చేశారు. ఈ విశేష కార్యక్రమం కలకాలం గుర్తుండిపోయేలా, వస్త్రప్రియులు ఆనందించేలా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు తమ ప్రత్యేకతను చాటి చెప్పారు. విస్తారమైన ఈ షోరూమ్- సౌత్ ఇండియా షాపింగ్మాల్ బ్రాండ్ తాలూకు అంకితభావానికి, ప్రత్యేకతకు గుర్తుగా కొనుగోలుదారుల ను అలరిస్తోంది. వివాహాది శుభకార్యాలు మొదలుకుని, ప్రత్యేక పర్వదినాలవరకు అన్ని తరాలను, తరగతులను అలరించే లక్షలాది వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం.
Also Read

ఈ శుభ సందర్భాన్ని ప్రతిబింబిస్తూ, స్థానికులకు సౌత్ ఇండియా షాపింగ్మాల్ సంస్థ డైరెక్టర్లు సురేశ్ సీర్ల, అభినయ్, రాకేశ్, కేశవ్ స్వాగతం పలికారు. అదే సమయంలో ఒంగోలు పరిసర ప్రాంత వస్త్రప్రియుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని విశేష సేవలు అందిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్మాల్ వారి అంకిత భావాన్ని ప్రశంసిస్తున్న కొనుగోలుదారులందరికీ సంస్థ డైరెక్టర్లు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను, సంతోషాన్నీ వ్యక్తం చేశారు.
సంస్థ డైరెక్టర్ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ, “ఒంగోలులో మా సౌత్ ఇండియా షాపింగ్మాల్ 38వ షోరూమ్ను శుభారంభం చేయడం మాకెంతో ఆనందదాయకం. ఒంగోలు వాసులు కోరుకునే నాణ్యతకు, నవ్యత్వానికి పెద్దపీట వేసి, వారి అభిరుచులను అడుగడుగునా ప్రతిబింబించే వైవిధ్యభరిత వస్త్రశ్రేణిని, షాపింగ్ అనుభూతిని ఒకేచోటకు తీసుకురావటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం” అని అన్నారు.
సంస్థ మరో డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ- “రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ విశేషమైన కేంద్రంగా, ఆకర్షణీయ షాపింగ్ గమ్యస్థానంగా కొనుగోలుదారులు తప్పక అభిమానిస్తారని” అన్నారు.
స్థానిక వస్త్రాభిమానులను స్వాగతిస్తూ మరో డైరెక్టర్ రాకేశ్, ‘ఒంగోలులోనే అతిపెద్ద షోరూమైన మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలు- ధరలోనూ, నాణ్యతలోనూ, వస్త్రప్రియుల అభిరుచులను ప్రతిబింబిస్తూ, వారిని అలరించడంలో తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అన్నిరకాల ఆదాయవర్గాల వారికీ అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత” అన్నారు.
సంస్థకు చెందిన ఇంకో డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ, “వైవిధ్యభరితమైన వస్త్రాలను కోరుకునే వారి కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్ను శుభారంభం చేయటం మాకు గర్వకారణం, అనందకరం. స్థానిక కొనుగోలుదారుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం సంతోషదాయకం. వారు కోరుకునే ప్రతి వెరైటీని అందించేందుకు మేము ఆసక్తితో ఎదురు చూస్తున్నాం” అన్నారు.
కర్నూల్ రోడ్, ఒంగోలులో అనేక ప్రత్యేకతలు కలిగిన సౌత్ ఇండియా షాపింగ్మాల్ వారి ఈ 38వ షోరూమ్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ తమ శాఖలను విస్తరించటంతోబాటుగా రీటైల్ రంగంలో ధర, నాణ్యతలకు సంబంధించిన సరికొత్త, సమున్నత ప్రమాణాలను సైతం పెంపొందిస్తూ, నేతృత్వ లక్షణాలతో అగ్రగామిగా నిలుస్తోందని, వివాహాది శుభాకార్యాలకు, విశేష పర్వదినాలకు వస్త్రాభిమానులకు ఇది వినూత్న గమ్యం కాగలదని ప్రశంసించారు.

తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!