దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా […]
ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో మొదటి అడుగు వేసింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేరాలని తహతహలాడుతున్న ఉక్రెయిన్‌కు యూరోపియన్ కమిషన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 27 దేశాల ఈయూలో సభ్యత్వం పొందాలంటే కీవ్‌కు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్.. తమ దేశంలో ప్రజాసామ్య సంస్థలను బలోపేతం […]
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మాట్లాడుతూ.. ‘అగ్నిపథ్’పై దేశంలోని పలుచోట్ల చెలరేగుతున్న నిరసనలను తాను ఊహించలేదని అన్నారు. ఈ పథకం దేశానికి, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా నిరసనలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ స్కీమ్’ అంటూ చెప్పుకొచ్చారు. […]
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం అసోంను కుంగదీస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత వరదల కారణంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 11 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మానస్, పగ్లాదియా, పుతిమరి, కొపిలి, గౌరంగ్, బ్రహ్మపుత్ర నదుల నీటిమట్టం కూడా అసోంలోని పలు చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. గోల్‌పరా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు […]
వాట్సప్… ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ఒక్క భారతదేశంలోనే దాదాపు 40 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారు. వాట్సప్ వినియోగదారులను దోచుకునేందుకు కొత్తకొత్త స్కాంలు బయటపడుతున్నాయి. తాజాగా మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌తో యూజర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఆ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి మరీ. భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఎంత పాపులర్ అయిందో వాట్సప్ కూడా అంతే పాపులర్ […]
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై శుక్రవారం దేశం భగ్గుమంది. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు చేపట్టింది. ఇవి కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. […]
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. జోధ్‌పూర్‌లోని ఆయన ఇంటితో పాటు, ఆయన కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించారు. తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ తనిఖీలు జరిపినట్లు చెప్పాయి. కాగా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎరువుల ఎగుమతుల్లో అవకతవకల ఆరోపణలున్నాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ […]
సోనియాగాంధీ ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోస్ట్ కొవిడ్ సమస్యలతో పాటు ఆమె దిగువ శ్వాసనాళంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఆమెకు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇటీవల కరోనా బారినపడ్డ ఆమె జూన్ 12న ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని […]
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఈ దాడులు జరిగాయి. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం-2002 కింద ఈ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 6న కూడా సత్యేందర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు దాడులు చేసి రూ.2.85 కోట్ల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్న […]
‘బ్యాట్‌మాన్: ది లాంగ్ హాలోవీన్’ కామిక్ ఆర్టిస్ట్ టిమ్ సేల్(66) గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన పలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన మృతికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. డీసీ కామిక్స్ యొక్క అధికారిక ట్విటర్ ఖాతా ప్రఖ్యాత కళాకారుడు టిమ్ సేల్‌కు నివాళులర్పించింది. టిమ్ సేల్ ‘గ్రౌండ్ బ్రేకింగ్ పేజీ డిజైన్‌లు’, కామిక్ పుస్తకాలు ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాయని ప్రశంసించింది. “టిమ్ సేల్ ఒక అద్భుతమైన […]