అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా గురువారం సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని […]
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ల వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జూన్ 5వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్లను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్ […]
బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లు సొంతం చేసుకోవాలంటే రూ. 20 వేల నుంచి రూ.30 వేలలోపు బడ్జెట్ ఉంటే సరిపోతుంది. ఈ రేంజ్‌లో లభించేవి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ కావు కానీ ఇవి చాలా తక్కువ ధరలతోనే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను ఆఫర్ చేస్తాయి. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే, చాలా బ్రాండ్‌ల మొబైల్స్ రూ.30 వేల లోపు ధరల్లో బెస్ట్ క్వాలిటీ కెమెరాలతో వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.30 వేల లోపు ఫోన్లలో బెస్ట్ క్వాలిటీ […]
కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సతమతమవుతోన్న ఉత్తరకొరియాను వరుస అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. కొవిడ్‌ను కట్టడి చేయలేక చేతులెత్తేసిన సమయంలోనే టైఫాయిడ్, తట్టు, కోరింతదగ్గు వంటివి విస్తృతంగా వ్యాపించినట్లు సమాచారం. ఇదే సమయంలో తాజాగా మరో అంటువ్యాధి ఉత్తర కొరియాను వేధిస్తున్నట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన కిమ్ జోంగ్ ఉన్.. వ్యాధి బారినపడిన వారికి తన కుటుంబం కోసం భద్రపరచిన ఔషధాలను అందించే […]
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సిల్లీ అని కొట్టిపారేయటం విస్మయాన్ని కలిగిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ […]
కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పలువురు అధికారుల ఇళ్లపై మూకూమ్మడి సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఒకేసారి 80 ప్రాంతాల్లో 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలను ముమ్మరం చేశారు. Agnipath: గుడ్‌న్యూస్.. ‘అగ్నిపథ్’ సర్వీస్‌కు అర్హత వయసు పెంచిన కేంద్రం ఈ దాడుల్లో దాదాపు 300 మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను […]
స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు 17.5 నుంచి 21 ఏళ్లుగా ఉన్న అర్హత వయసును 23కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్రివిధ దళాల్లో సైనిక నియమకాల కోసం ‘అగ్నిపథ్’ పేరుతో కేంద్రం ఇటీవల కొత్త సర్వీస్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత […]
ఉక్రెయిన్‌లో రష్యా నెలల తరబడి యుద్ధం సాగిస్తున్న వేళ… గురువారం కీలక పరిణామం చోటుచేసుకొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహానిస్‌లు రైలులో రాజధాని కీవ్‌కు వచ్చారు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రొమేనియా అధినేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు. వారు గురువారం అనూహ్యంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈయూలో చేరాలన్న […]
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ఏకగ్రీవ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. కానీ ఆజాదీ కా అమృతోత్సవ్ నేపథ్యంలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు విపక్షాలనూ ఒప్పించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్ […]
రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ-20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారాతో పాటు పలువురు ఆటగాళ్లు లండన్ బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ […]