కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు పి.చిదంబరం, మల్లిఖార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ […]
తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ ధరలను పెంచాలని అంటోంది. నిర్వహణ వ్యయం అధికం కావడం వల్ల టికెట్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచాల్సిందేనని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. రూపాయి మారకపు విలువ పడిపోవడం, ఇంధన ధరలు అధిక కావడం వల్ల సంస్థకు నిర్వహణ వ్యయం పెరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచాలని జెట్ ఎయిర్‌వేస్ […]
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని ఆయన మండిపడ్డారు. వందలాది మంది భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల […]
చిన్నతనంలో సరిగా చదవకపోయినా, పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోయినా పెద్దయ్యాకా గాడిదలు కాస్తావా.. అంటూ చాలా మంది అంటుంటారు. కానీ ఓ ఐటీ ఉద్యోగి తన ఉద్యోగాన్ని, ఆరంకెల జీతాన్ని వదిలి గాడిదలు కాస్తున్నాడు. నిజమేనండోయ్.. గాడిదల పెంపకాన్ని సాక్షాత్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మంగళూరు నగరానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారంను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ […]
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చెప్పింది. పాజిటివ్‌గా తేలిన తర్వాత మార్‌క్రమ్ ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు తిరిగి జట్టుతో చేరి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయంతో బాధపడుతున్న డికాక్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ […]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఈ నెల 18న శతవసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగనున్న ఆమె పుట్టిన రోజు వేడుకల్లో మోదీ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా వాద్‌నగర్‌లోని హటకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పావగఢ్‌లోని కాళీమాత ఆలయంలో జరిగే పూజల్లోనూ మోదీ పాల్గొంటారు. తల్లి శత వసంత పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని గాంధీనగర్‌లోని రైసన్ పెట్రోల్ పంపు నుంచి 60 మీటర్ల రోడ్డుకు ‘పూజ్య హీరా మార్గ్’ అని నామకరణం […]
గగనతలంలో విమానాలు ఢీకొనే పెను ప్రమాదాన్ని తప్పించి 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని పైలట్ల అప్రమత్తతతో తుర్కియే గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్-504 విమానం ఈ నెల 13న లండన్ నుంచి 275 మంది ప్రయాణికులతో కొలంబో బయలుదేరింది. విమానం టర్కీ గగనతలం పైనుంచి 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని 35 వేల అడుగులకు […]
ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ముప్పు ముంచుకొస్తోంది. దాదాపు 30 దేశాలకు విస్తరించి, ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి మంకీ పాక్స్. మంకీపాక్స్ పేరును మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్ణయించింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో స్పందించిన డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని 30 దేశాల్లో 1,600 మందికి మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ కాగా.. మరో 1,500 అనుమానిత కేసులు ఉన్నాయి. ఐరోపా దేశాల్లో ఈ వైరస్ […]
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పడింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపైనా రకరకలా ఊహగానాలు వెలువడుతుండడంతో అందరూ ఆయనకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఎక్కువ రోజులు బతికి ఉండలేరని ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. వ్లాదిమిర్ పుతిన్ […]
చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని ఇంజెక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. దశాబ్దాల తరబడి మానవాళిని పీడిస్తున్న హెచ్‌ఐవీ ఇక తోకముడవనుంది. ఎయిడ్స్‌కు కారణమయ్యే ఈ వైరస్‌ను సమూలంగా అంతమొందించే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ […]