Jakki Mahesh
Author- NTV Telugu-
Floods: ఉగ్రరూపం దాల్చిన నదులు.. వరదల్లో 55 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. భారీగా వర్షాలు పడుతున్న అసోంలో మరో 9 మంది మరణించగా వరదల ధాటికి.. రాష్ట్రం మొత్తం చనిపోయిన వారి సంఖ్య 55కు చేరింది. 28 రాష్ట్రాల్లోని దాదాపు 19 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర, బరాక్ వాటి ఉపనదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు వందలాది గ్రామాలను ముంచెత్తుతున్నాయి. వరదల […] -
India Corona: దేశంలో కరోనా కల్లోలం.. వరుసగా మూడోరోజు 12వేలకు పైగానే..
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాజాగా 12 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి మరో […] -
Corona Vaccine: అమెరికా కీలక నిర్ణయం.. 6 నెలల పసికందులకు కరోనా టీకా
ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు శుక్రవారం ఆమోదం లభించింది. . టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై […] -
Terrorists Attack: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఎస్సైపై కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో అటు ఉగ్రవాదులు, ఇటు భద్రతాబలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని తన నివాసంలోనే ఓ ఎస్సైని కాల్చి చంపారు. మృతుడిని ఫరూక్ అహ్మద్ మీర్‌గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పుల్వామా జిల్లా పాంపొర్‌లోని సంబూరా ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్పై దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లెథ్‌పొరా సీటీసీ ఐఆర్పీ 23వ బెటాలియన్‌లో మీర్ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడినవారి […] -
Heeraben Modi Birthday: శతవసంతంలోకి ప్రధాని తల్లి.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
దేశానికి ప్రధానైనా తల్లికి కొడుకే..! అందుకే ప్రభుత్వ, రాజకీయా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ వీలు చేసుకొని తన తల్లిని కలుస్తుంటారు ప్రధాని మోదీ. గుజరాత్‌కు వెళ్లి ఆమెతో గడుపుతుంటారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గుజరాత్ పర్యటనలోనే ఉన్న మోదీ.. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఉన్న తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు […] -
IND vs SA: అదరగొట్టిన అవేశ్‌ఖాన్.. నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–2తో సమం చేసింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. మొన్న మూడో టీ20 మ్యాచ్ గెలిచిన భారత కుర్రాళ్లు… నేడు నాలుగో టీ20లోనూ దుమ్మురేపేశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) […] -
Agnipath Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్
దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా […] -
Ukraine: ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా
ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో మొదటి అడుగు వేసింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేరాలని తహతహలాడుతున్న ఉక్రెయిన్‌కు యూరోపియన్ కమిషన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 27 దేశాల ఈయూలో సభ్యత్వం పొందాలంటే కీవ్‌కు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్.. తమ దేశంలో ప్రజాసామ్య సంస్థలను బలోపేతం […] -
Navy Chief: అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్మెంట్ స్కీమ్
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మాట్లాడుతూ.. ‘అగ్నిపథ్’పై దేశంలోని పలుచోట్ల చెలరేగుతున్న నిరసనలను తాను ఊహించలేదని అన్నారు. ఈ పథకం దేశానికి, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా నిరసనలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్మెంట్ స్కీమ్’ అంటూ చెప్పుకొచ్చారు. […] -
Assam Floods: వరదలతో అసోం విలవిల.. 8 మంది మృతి
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం అసోంను కుంగదీస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత వరదల కారణంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 11 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మానస్, పగ్లాదియా, పుతిమరి, కొపిలి, గౌరంగ్, బ్రహ్మపుత్ర నదుల నీటిమట్టం కూడా అసోంలోని పలు చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. గోల్పరా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు […]
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!