కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఇవాళ గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీక్ష వివరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి […]
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్‌పై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్ పేర్కొంది. జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్ […]
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఫీట్ సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత జరిగిన తొలి టోర్నీలో జాతీయ రికార్డు సృష్టించగా, రెండో టోర్నీలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న కోర్టానే గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. కాగా, 90 మీటర్ల మార్కును సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అది కుదరలేదు. చోప్రా […]
గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం దేశంలో పసిడి ధరలు ఈ రోజు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. పది గ్రాముల బంగారంపై దాదాపు రూ. 100 తగ్గింది. తాజాగా కిలో వెండిపై రూ. 300 వరకు పెరిగింది. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం […]
కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్‌ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్‌ను సమం చేసిన టీమ్‌ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని […]
తన భర్త తరచూ ఆడవారిలా రెడీ అవుతున్నాడని, లిప్‌స్టిక్ పూసుకుంటున్నాడని, పెళ్లై రెండేళ్లయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తపై పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త.. ఆడవారిలా తరచూ రెడీ అవుతున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా లైంగిక సంబంధం పెట్టుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ […]
సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ వేదికగా మండిపడింది. ఆ వీరుడి అంతిమ యాత్రలో ఉండాల్సింది, భారత త్రివర్ణ పతాకమని.. ఫాసిస్టు పింకు జండాలు కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్ విద్యార్థి చావు ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాబందులు శవాల మీద వాలి పీక్కు తినడం తెరాస నాయకులను చూసే నేర్చుకున్నాయేమో […]
సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందని ఆయన ఆరోపించారు. దాడుల వెనుక ఇక్కడ టీఆర్ఎస్ హస్తం ఉంటే.. యూపీలో ఎవరి హస్తం ఉన్నట్లు అని ఆయన ఎద్దేవా […]
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. అరెస్ట్ గురించి రాతపూర్వకంగా పత్రం ఇస్తేనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ రేవంత్ […]
అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్రం వైఖరి మారాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిహార్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా.. అక్కడ హింస ఎలా జరిగిందని బండి సంజయ్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అక్కడ బీజేపీ కుట్ర చేసిందా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ మూర్ఖపు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని గంగుల మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కోణంలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో పల్లెప్రగతి […]