Govt Jobs: అప్లై చేశారా?.. ఇండియన్ పోస్ట్, రైల్వేలు, బ్యాంకులు, UPSC లలో 54,000+ పోస్టులు.. 10th, డిగ్రీ ఉంటే చాలు
- ఇండియన్ పోస్ట్, రైల్వేలు, బ్యాంకులు, UPSC లలో 54,000+ పోస్టులు
- 10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్లు/పోస్ట్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువతకు సువర్ణావకాశం. ప్రస్తుతం, ఇండియన్ పోస్టల్ సర్వీస్, బ్యాంకులు, రైల్వేలు, UPSC, ఇండియన్ ఆర్మీ, ISRO వంటి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 54,000 కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్లు/పోస్ట్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హులు. ఉద్యోగం లేదని వర్రీ అవుతున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
Also Read:Maoist Threat Letters: మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు.. 99 శాతం ఫేక్..
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఏ విభాగంలో ఎన్ని పోస్టులు?
UPSC CSE, IFS
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026, UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష 2026 కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 933 పోస్టులు భర్తీకానున్నాయి. యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, అగ్రికల్చర్ లేదా ఇతర సూచించిన సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026.
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2026
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఇండియా పోస్ట్ పోస్టుల భర్తీ చేపడుతోంది. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి 14, దరఖాస్తును పూర్తి చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
NCERTలో 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ మొదలైన ఎడ్యుకేషన్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆర్మీలో ఖాళీలు
భారత సైన్యం ఎనిమిది లెఫ్టినెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. JAG ఎంట్రీ 124 కింద ఈ రిక్రూట్ మెంట్ జరుగుతుంది. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన లేదా LLM చదువుతున్న అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇస్రోలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) 49 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech/BSc/ME/MTech/MSc డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 12.
బ్యాంక్ రిక్రూట్‌మెంట్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటికి దరఖాస్తు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. అదనంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2,050 సర్కిల్-బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 18. గ్రాడ్యుయేట్లు/CA/CFA/MBA గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Also Read:Bangladesh: ముగిసిన యూనస్ శకం.. ప్రజల తీర్పు ఏం చెబుతోంది?
రైల్వే గ్రూప్ డి రిక్రూట్‌మెంట్
రైల్వేలు 22,000 గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ మార్చి 2, 2026 నాటికి పూర్తవుతుంది.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!