ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఈ దాడులు జరిగాయి. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం-2002 కింద ఈ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 6న కూడా సత్యేందర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు దాడులు చేసి రూ.2.85 కోట్ల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
అంతకుముందు చేసిన దాడుల్లోనూ పలు పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం సత్యేందర్ జైన్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకుముందు కొన్ని రోజుల పాటు ఆయన ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన 2017 నుంచి విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2015-16లో కోల్‌కతాలోని సత్యేందర్ జైన్ సంస్థలకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఈ విచారణ జరుగుతోంది.
RBI Report: దేశంలో అప్పుల భారం ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ
కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో ఆయనను మే 30న ఈడీ అదుపులోకి తీసుకుంది. జైన్ కుటుంబం, కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు గత నెలలో ఈడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 2018లోనే సత్యేంద్రను ప్రశ్నించింది ఈడీ.