కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు 2జీ, 3జీ, 4జీలు.. బీజేపీ 2జీ, 3జీ, 4జీ కాదు తెలంగాణ ప్రజల పార్టీ అని అమిత్ షా అన్నారు. మోడీ కృషితోనే చంద్రాయన్ విజయవంతం అయింది.. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని విధానంగా బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు.
నర్సాపూర్ లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చీమలు బారులు తీరినట్లుగా ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన మీకు అభినందనలు.. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.
బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆయన సతీమణి కొత్త సరితా రెడ్డి గడప గడప ప్రచారం నిర్వహిస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి కొత్త మనోహర్ రెడ్డిని గెలిపించాలని మహిళలను ఆమె కోరారు.
నన్ను తిట్టే హక్కు బీజేపీ నాయకులకు లేదు.. కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పని చేసే వ్యక్తిని కాదు.. మిలాగా లొంగిపోను.. అద్వానీ నాకు గురువు.. ఆయన మాకు సంస్కారం నేర్పారు.. మీలాగా అసభ్యకరంగా మాట్లాడను.. నాపై మాట్లాడిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వన్డే ప్రపంచ కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడుతుంది. 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్లో తలపడుతున్నాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ నగరంలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది.
తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్స్ విజేత ఎవరో అతను తేల్చి చెప్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.