భారత్ మాత్రమే కాదు.. పాకిస్థాన్ గాలి కూడా అత్యంత విషపూరితంగా మారింది. ఢిల్లీతో పాటు లాహోర్ లో కూడా కాలుష్యం విషపూరితంగా మారుతుంది. గాలి నాణ్యత స్థాయిలతో ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్స్‌లో లాహోర్ అగ్రస్థానంలో కొనసాగింది. పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నగరం పొగమంచుతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దెబ్బతింటుంది.
Read Also: Hyderabad: స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి..
ఇక, స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ ( IQAir ) కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్ నగరంలో గాలి నాణ్యత ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘ప్రమాదకర’ 470గా నమోదు అయింది. కాగా, ఢిల్లీలో 302 వద్ద, కరాచీ 204 వద్ద ఉన్నాయి. డాన్ తెలిపిన ప్రకారం.. వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం, పంటలను కాల్చడం వలన వచ్చే పొగ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అత్యంత హానికరమైన PM2.5 యొక్క గాఢతపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్షిక (WHO) గాలి నాణ్యత మార్గదర్శక విలువ కంటే 15 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
Read Also: Minister Adimulapu Suresh: నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమే..
ఈ పొగమంచు కారణంగా లాహోర్ నగరంలో ఎదురుగా వచ్చే వారు కూడా కనిపించడం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లాహోర్‌లోని చాలా మంది ప్రజలు విషపూరితమైన గాలి కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ పొగమంచు నుండి తప్పించుకోవడానికి కొంతమంది నగరాన్ని విడిచి పెట్టి వెళ్లి పోతున్నారు. ఈ పొగమంచును తగ్గించే చర్యల్లో భాగంగా పంజాబ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం అక్కడి విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. లాహోర్ హైకోర్టు నిర్ణయం తర్వాత ప్రావిన్షియల్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, లాహోర్ తో పాటు పంజాబ్‌లలో పొగమంచు సంక్షోభం నిత్యం కొనసాగుతునే ఉంది. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో సంభవిస్తుంది అని డాన్ నివేదిక సూచించింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశాల్లో పాకిస్తాన్ మూడవ స్థానంలో ఉండగా లాహోర్ అత్యంత కాలుష్య నగరంగా తొలి స్థానంలో ఉందని IQAir వెల్లడించింది.