Hyderabad: సికింద్రాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు దుండగులు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని లాడ్జిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతోపాటు నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డిలో 13 ఏళ్ల బాలిక ఈ నెల 4వ తేదీన కనిపించకుండా పోయింది. ఆ బాలిక సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చింది. ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డుపై తిరిగుతూ ఉండిపోయింది. బాలికను ఓ మైనర్ బాలుడు గమనించాడు. ఇంటికి తీసుకువెళ్తామంటూ లాడ్జికు తీసుకెళ్లాడు. లాడ్జిలో బంధించి ఈ ముఠా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇద్దరు మైనర్ బాలులతోపాటు నలుగురు కలిసి బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ ఒక లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ పాల్పడ్డ నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.
READ MORE: Akhanda2 : 24 గంటల్లో బాలయ్య ఊచకోత.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్