కూకట్ పల్లి నియోజకవర్గం జనసిన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో అలంపూర్ కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
సూర్యాపేట జిల్లాలోరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కపై (శిరీష) నిన్న దాడి జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు.
నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్షో లు నిర్వహించబోతున్నారు. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన, నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపోత్సవం నాగసాధువులచే మహా రుద్రాభిషేకం కొనసాగింది. సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన జరిగింది.