తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి గుర్తుల భయం పట్టుకుంది. ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తుంది.
ఇవాళ రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టోలోని అంశాలను వివరించనున్నారు.
నేడు మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. మంచిర్యాల, జన్నారంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించనున్నారు.
నేడు కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాన్నం 1 గంటకి తొలుత మొదట కరీంనగర్ కు చేరుకోనున్నారు.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగియనుండటంతో నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు.
చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి.. ఇక్కడి ప్రజలకు కేసీఆర్ ఇచ్చిందేం లేదు.. ఒక్క జవహర్ నగర్ డంపింగ్ యార్డు తప్ప.. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేశాడు అంటే పొరపాటు.. ప్రజలకి సంబంధం లేదని చెప్పాలని అనుకుంటుంటే తప్పు.. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు త్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం.. ప్రజల పోరాటం అది అని చిదంబరం పేర్కొన్నారు.