వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది. బాలయ్య – బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 మరికొన్ని గంటల్లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. అసలే ఒకసారి వాయిదా పడి వస్తోంది. వాయిదా వేయడంతో అటు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు ఫాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల ఆటతో వచ్చేస్తోంది అఖండ 2.
మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే బాలయ్య మాస్ స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. గడచిన 24 గంటల్లో 1,13,000 లక్షల టికెట్స్ బుకింగ్స్ తో దూసుకెళ్తోంది అఖండ 2. బాలయ్య మాస్ స్టామినా ఏంటో చూపిస్తోంది అఖండ 2. కేవలం హైదరాబాద్ బుకింగ్స్ బుక్ మై షోస్ పరంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్‌లు రూ. 3 కోట్లు దాటాయి. ప్రీమియర్‌ల బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అవి ఓపెన్ చేస్తే ఇంకా ఎక్కువ జోరు చూపించే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే సీనియర్ హీరోల చిత్రాల విషయంలో నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్ నమోదవుతుందని అంచనా వేస్తుంది ట్రేడ్. ఇక వరల్డ్ వైడ్ గా అఖండ2 ప్రపంచవ్యాప్త ప్రీ-సేల్స్ గ్రాస్ సుమారు రూ. 15.5 కోట్లు దాటింది. ఇవి కేవలం బుక్ మైషో బుకింగ్స్ మాత్రమే. ఆఫ్ లైన్ కలెక్షన్స్ కూడా కలిపి డే 1 భారీ ఓపెనింగ్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇది బాలయ్య మాస్ విధ్వంసం అనే చెప్పాలి.
Also Read : Akhanda 2 : ప్రీమియర్స్ కు మరికొన్ని గంటలే.. టెన్షన్ లో నందమూరి ఫ్యాన్స్. షోస్ ఉంటాయా ఉండవా?