Vijayashanti warning: కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ కోసం 25 ఏళ్ళు పని చేశా.. కాంగ్రెస్ విడిచి బీజేపీలోకి వెళ్ళాను.. బీజేపీ, కేసీఆర్ అవినీతిని బయటకు తీసి లోపల వేస్తామన్నారు.. బీజేపీ హైకమాండ్ మాకు మాట ఇచ్చారు.. మాటకు కట్టుబడి ఉంటారు అనుకున్నా.. నెలలు గడిచాయి కానీ చర్యలు తీసుకోలేదు అని ఆమె మండిపడ్డారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది అర్థం కాలేదు.. మోడీ, అవినీతికి వ్యతిరేకం అంటారు.. కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పారు.. మోడీ దగ్గర, కేసీఆర్ కుటుంబ అవినీతి వివరాలు అన్ని ఉన్నాయని విజయశాంతి తెలిపారు.
Read Also: Thummala: పొంగులేటిపై తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు.. మేం శత్రువులం కాదు.. కానీ..!
అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ అందరూ కేసీఆర్ అవినీతి పరుడు అంటారు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనేది అర్థం అయ్యింది.. తెర ముందు ఒకటి, తెర వెనుక ఒకటి మాట్లాడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలు, నాయకులను మోసం చేస్తుంది.. నమ్మించి మోసం చేస్తున్నారు.. కాంగ్రేస్ అధికారంలోకి వస్తుంది అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తుంది.. బండి సంజయ్ ని మార్చారు.. వొద్దు అని చెప్పిన.. ఎన్నికలకు నాలుగు నెలల ముందు వద్దు అన్నాను.. అయినా నా మాట వినలేదు అని విజయశాంతి తెలిపారు.
Read Also: Pepper Motion: కుదిరిన ఎంవోయూ.. ఏపీలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహన యూనిట్
బండి సంజయ్ ని.. మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అని విజయశాంతి అన్నారు. కేసీఆర్ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్ ని మార్చేసింది అని ఆమె ఆరోపించారు. బీజేపీలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి.. కేసు ఏమైంది.. ఆలోచించండి.. బీజేపీని వాళ్లకు వాళ్ళే నాశనం చేసుకున్నారు.. మెడిగడ్డ పిల్లర్లు కూలి పోతుంటే ఏం చేస్తుంది బీజేపీ అని ఆమె ప్రశ్నించారు. ఇది బాధాకరం.. నన్ను తిట్టే హక్కు బీజేపీ నాయకులకు లేదు.. కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పని చేసే వ్యక్తిని కాదు.. మిలాగా లొంగిపోను.. అద్వానీ నాకు గురువు.. ఆయన మాకు సంస్కారం నేర్పారు.. మీలాగా అసభ్యకరంగా మాట్లాడను.. నాపై మాట్లాడిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.