రుషికొండలో రాజమహల్ నిర్మించుకొంటూ క్లాస్ వార్ అంటారా?.. అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పేదవాడికి సెంటు భూమే.. ముఖ్యమంత్రి నివాసానికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తారా?.. సీఎం పచ్చదనం చూసేందుకు ప్రహరీ నిర్మించి గడ్డి పెంచడానికి.. రూ 21 కోట్లు నిధులా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం. ఈ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరుకానున్నారు.
కార్గో మాసోత్సవాల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు 35 పుస్తకాలను కార్గో డోర్ డెలివరీ చేశారు. సంస్థ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచేందుకు తన వంతు బాధ్యతగా డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకున్నాను అని ఆయన తెలిపారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు.
చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే.. ఆయనను నిర్ధోషి అని ప్రకటించలేదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సిన టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
కోర్టు వ్యాఖ్యానాలు చూస్తే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చేయని తప్పుకు 50 రోజులు చంద్రబాబు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది అని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.
ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారు.. కిలారి రాజేశ్, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులిచ్చారు.. స్కిల్ స్కామ్‌తో సంబంధంలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి అని ఆయన సూచించారు. చంద్రబాబు ఆఫ్రూవల్తోనే నిధులు రిలీజ్ అయినప్పుడు ఆయనే A1 అవుతారు.. ముఖ్యమంత్రి ప్రధాన పాత్రధారి అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి.. ఫేక్ ఇన్వాయిస్లతో 241 కోట్ల రూపాయలు దోచేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడంతో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమని ఆయన తెలిపారు.
ఈనెల 25న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు.