Khalistani Terrorist Threatens: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి తెలియజేస్తూ.. మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా అతడు ప్రశ్నించాడు.
Read Also: Bhatti Vikramarka: సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..?
ఇక, అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు గురుపత్వంత్ సింగ్ మెంబర్ గా ఉన్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఆయన ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇస్తూ.. గత నెలలో కూడా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి మోడీ గుణపాఠం నేర్చుకోవాలన్నాడు. భారత్ లో కూడా ఇలాంటి యుద్ధం స్టార్ట్ అవుతుందని తెలిపాడు.
Read Also: KTR: కామారెడ్డిలో కేటీఆర్ రోడ్ షో.. రేవంత్‌రెడ్డికి మంత్రి కౌంటర్
అయితే, అహ్మదాబాద్ వేదికగా రేపు జరుగనున్న ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఫైనల్ మ్యాచ్ ను క్యాన్సిల్ చేయాలని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని కూడా హాజరవుతుండటంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.