Year End Discounts Maruti Suzuki: 2025 ఏడాది చివరకు చేరుకుంది. నిజానికి కారు కొనుగోలుకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. పండుగ సీజన్‌లో ఆఫర్లు మిస్ అయిపోయినా, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువై ఇబ్బంది పడ్డా.. డిసెంబర్ నెలలో కంపెనీలు స్టాక్ క్లియరెన్స్ కోసం భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తాయి. ఈసారి దేశంలోని అతిపెద్ద కార్ తయారీదారు మారుతి సుజుకి కూడా తన అరెనా లైనప్‌పై ఆల్టో K10, S-ప్రెస్సో, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రిజా, ఎర్టిగా వంటి మోడళ్లకు భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అయితే డిస్కౌంట్‌లు డీలర్‌షిప్‌పై ఆధారపడి మారవచ్చు.
Akhanda2: రెగ్యులర్ షోల బుకింగ్స్ ఓపెన్.. ప్రీమియర్ బుకింగ్స్ ఎప్పుడు అంటే!
ఇక మారుతి సుజుకి డిసెంబర్ 2025 ఆఫర్ల విషయానికి వస్తే.. బడ్జెట్-ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్‌లపై ఈ నెల భారీ ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఆల్టో K10, S-ప్రెస్సో, సెలెరియో కొనుగోలుపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, అలాగే రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అలాగే భారత కుటుంబాల అత్యంత నమ్మదగిన కార్లలో వాగన్ ఆర్ ఒకటి. ఈ మోడల్‌పై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తున్నారు. అద్భుతమైన హ్యాండ్లింగ్, సమర్థవంతమైన 3-సిలిండర్ ఇంజిన్‌తో ప్రసిద్ధి చెందిన స్విఫ్ట్ పై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తాయి. వీటితోపాటు కార్పొరేట్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది.
Tata Sierra: నెల రోజులు కాకముందే.. 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..
ప్రాక్టికల్, నమ్మదగిన కార్ కోసం చూస్తున్న వారికి ఈకో ఇప్పటికీ అత్యంత విశ్వసనీయ ఎంపికగా నిలుస్తుంది. టయర్ 2, టయర్ 3 నగరాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఈ మోడల్‌పై రూ.25,000 క్యాష్ ఆఫర్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ వర్తిస్తాయి. కొత్తగా రిఫ్రెష్ డిజైన్‌తో వచ్చిన డిజైర్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. నిజానికి బ్రిజా పై మారుతి డిస్కౌంట్ ఇవ్వడం అరుదు. అయితే ఈసారి కంపెనీ రూ.10,000 క్యాష్ ఆఫర్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ ప్రకటించింది. అలాగే కార్పొరేట్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. అలాగే చాలావరకు ఎర్టిగా డిస్కౌంట్‌ల జాబితాలో ఉండదు. కానీ, ఈసారి 7 సీటర్ మోడల్‌పై రూ.10,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. వీటితోపాటు 15 సంవత్సరాలకు పైబడిన కార్లను స్క్రాప్ చేసే వినియోగదారులకు కంపెనీ రూ.25,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ అందిస్తోంది.