Vivo V70, Vivo T5x:వివో సంస్థ తాజాగా Vivo V70 మొబైల్ సంబంధించి మరోసారి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో దర్శనమిచ్చి.. గ్లోబల్ రిలీజ్‌కు కంపెనీ సిద్ధమవుతోందని సూచించింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత మార్కెట్లో కూడా రానున్నట్టు స్పష్టమైంది. BIS (Bureau of Indian Standards) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో Vivo V70 (మోడల్ నంబర్ V2538) కనిపించింది. ఇది IMEI రికార్డ్‌లో కనిపించిన అదే మోడల్ నంబర్ కావడంతో.. భారత లాంచ్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టే అని తెలుస్తుంది. అయితే దీనితోపాటు V2545 మోడల్ నంబర్‌తో మరో వివో డివైస్ కూడా BIS సైట్‌లో కనిపించింది. ఇది Vivo T5xగా టెక్ నిపుణులు భావిస్తున్నారు.
IP68/69 రేటింగ్ సర్టిఫికేషన్స్, 50MP+50MP కెమెరా సెటప్ తో రాబోతున్న Oppo Reno 15c..
ఇక Vivo V70 గురించి తెలిసిన వివరాల్లో.. ఇందులో Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, Adreno 722 GPU, Android 16 ఆధారిత OriginOS 6, 8GB RAM ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక Geekbenchలో ఈ ఫోన్ 1235 (సింగిల్ కోర్), 3920 (మల్టీకోర్) స్కోర్లు సాధించింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో Vivo S50 మొబైల్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా రాబోతున్నట్టు ప్రచారం. ఇది నిజమైతే ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో కూడిన ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. ఇక కెమెరా సెక్షన్‌లో 50MP మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్), 50MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే 6,500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండవచ్చు. ఈ ఫోన్ IP69 రేటింగ్ కూడా పొందే అవకాశముంది.
Vivo X300 Pro Price: లక్ష 10 వేల ఫోన్ రూ.3,167కే మీ సొంతం.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఇక Vivo T5x విషయానికి వస్తే.. ఇది మొదటిసారి సర్టిఫికేషన్ లిస్టింగ్‌లో కనిపించడం వల్ల ఇప్పటివరకు ఎలాంటి స్పెసిఫికేషన్ సమాచారం లభించలేదు. అయితే BIS లిస్టింగ్ దాని భారత లాంచ్‌కు పర్మిషన్ ఇచ్చినట్టే అనుకోవచ్చు. త్వరలోనే ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.