నేడు సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు.
నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికీ చేరేలా కమలం పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలంగఆణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుంది.. తాండూరులో మా మిత్రపక్షం జనసేన పోటీ చేస్తుంది.. మిత్ర పక్షంలో ఉన్న వారిని బీజేపీ గౌరవిస్తుంది.. సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజయ్ నీ మార్చడం జరిగింది..
తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఆయన చెప్పారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడ్డారు.. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది.. మోడీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని మల్లికార్జున ఖర్గే అన్నారు.
కేసీఆర్ అన్ని లక్షల కోట్లు ఏం చేశాడో.. అన్ని లక్షల కోట్లు మీ అకౌంట్ లో వేస్తాము అని రాహుల్ గాంధీ చెప్పారు. 12 వందల సిలిండర్ ధరను 500 రూపాయలకే రాబోతుంది.. ప్రతి నెల 2500 బ్యాంక్ అకౌంట్ లలో మహిళలకు వేస్తాను.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్‌లోని దేశాలు పెద్ద ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజాలోని పెద్ద పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో ఈ యుద్ధంలో మరణించిన వారి గురించి వారి బంధవులు ఇప్పుడు శిథిలాల కింద గాలిస్తున్నారు.
తెలుగులో జీపీటీ అసంపుర్తిగా ఉంది. ఇతర భారతీయ భాషలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వెలితిని పూడ్చేందుకు ‘ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ ముందుకు వచ్చింది.
కేవలం అవినీతి ఆరోపణలతో కోటాను కోట్లు డబ్బుల సంచులు తీసుకున్నందుకే బండి సంజయ్ పదవిని తీసేయడం జరిగింది.. ఇయ్యాలా ఆ నోట్ల కట్టలతో ఓటుకు 20 వేలైనా వెదజల్లి గెలుస్తా అనే డబ్బు మదంతో పోటీలో దిగాడని మంత్రి గంగుల కమలాకర్ దుయ్యబట్టారు.