Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్థరాత్రి మహిళపై కత్తితో దుండగులు దాడికి దిగారు. ప్రైవేట్ హాస్పిటల్ లో పని చేస్తున్న నర్సు సునీత విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైకు మీద వచ్చి ఆగంతుకులు దాడి చేశారు. సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారు అయ్యారు. శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలు, స్పృహ తప్పి పడిపోయింది. గాయాలతో ఉన్న సునీతను ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
Read Also: Akhanda2 : 24 గంటల్లో బాలయ్య ఊచకోత.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్
ఇక, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తున్నారు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఈ దాడి ఘటన బంగారం చోరీ కోసమా లేక వ్యక్తిగత విభేదాలే కారణమా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.