సూర్య .. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాల ద్వారా పెద్ద మార్కెట్‌ను సంపాదించుకున్న అతి కొద్ది మంది స్టార్లలో సూర్య ఒకరు. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా విలక్షణ పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన ఆకట్టుకుంటున్నారు. అలాంటి సూర్యపై తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్‌లో మరో బిగ్ ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఎవరంటే?
సూర్య తమ్ముడు, హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘వా వాతియర్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో, మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సందీప్ కిషన్, దేవ కట్టా, బాబీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వచ్చిన మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు.. కార్తీ కుటుంబం తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.. బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘కార్తీ గారి ఫ్యామిలీతో నాకు మొదటి నుంచి చాలా మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా సూర్య గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఒకసారి నేను, సూర్య గారు కలిసి రాజమండ్రిలో ఒక ఫంక్షన్‌కి వెళ్లాం. అక్కడ జనం విపరీతంగా చుట్టుముట్టడంతో.. వారి నుంచి తప్పించుకోవడానికి మేమిద్దరం కలిసి గోడలు కూడా దూకాల్సి వచ్చింది’ అంటూ ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ స్థాయిలో ఆయనతో తనకు ఆత్మీయ సంబంధం ఉందని తెలిపారు.
కార్తీపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ఈ జనరేషన్ హీరోలందరికీ మీరంటే చాలా ఇష్టం. మీ తొలి సినిమా రషెస్‌ని నేను, జ్ఞానవేల్ రాజా చూశాం. ఆ సినిమాలో మీ మాస్ సాంగ్‌కి థియేటర్ ఎలా ఊగిపోయిందంటే అది ఒక సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పటికీ నా కళ్ల ముందు అది కనిపిస్తూనే ఉంటుంది. మీ తెలుగు చాలా క్యూట్‌గా ఉంటుంది. ‘ఊపిరి’ సినిమాలో మీరు పెయింట్ వేసే సీన్ నా ఫేవరేట్. మా ఇంట్లో అది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. మంచి సినిమాలు చేస్తూ.. కొత్త దర్శకుల్ని మీరు ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ సినిమా కూడా ఇక్కడ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని బన్నీ వాసు తెలిపారు.