Minister Seethakka: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. నియోజక వర్గ ఇంఛార్జుల పని తీరు ఏం బాగోలేదని వెల్లడించింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి చెప్పి.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అన్నారు. ఇక, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తాను అని పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పుకొచ్చారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన కోర్టు..
అయితే, ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రభుత్వం- పార్టీ మధ్య సమన్వయం కోసం పని చేయనుందని ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఇక, ఈ సందర్భంగా సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రావి శ్రీనివాస్ ను మీనాక్షి నటరాజన్ మందలించింది. మంత్రి సీతక్క ఫోన్ ఎత్తడం లేదని శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు.