Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నేతలను నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారు మూడో గ్రూప్ గా విభజించిన నటరాజన్. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Posani Krishna Murali: పోసాని ఉక్కిరిబిక్కిరి..! కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
మరోవైపు, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తాను అని ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటుకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయం కోసం ఈ కమిటీ పని చేయనుంది. ఈ సందర్భంగా సిర్పూర్ ఇంఛార్జ్ రావి శ్రీనివాస్ నీ మీనాక్షి నటరాజన్ మందలించారు. మంత్రి సీతక్క ఫోన్ ఎత్తడం లేదని రావి శ్రీనివాస్ ఫిర్యాదుతో ఆగ్రహం వ్యక్తం చేసింది.