Minister Sridhar Babu: మినిస్టర్ క్వార్టర్స్లో "NXP సెమీ కండక్టర్స్" ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమైయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు.
Kishan Reddy: తెలంగాణలో భారతీయ జనతా పార్టీది తిరుగులేని విజయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పట్టభద్రులు ప్రభుత్వానికి , రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు అని తెలిపారు.
Ponnam Prabhakar: ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నూతన బిల్డింగ్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హైదారాబాద్ సీపీ సీవీ ఆనంద్, వీహెచ్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
MLC Kavitha: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి.. ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది అన్నారు. పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి.. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు అని పేర్కొన్నారు.
IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగనుంది. ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా, కివీస్ మధ్య జరిగబోయే పోరు చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే, సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఒకదానికొకటి పోటీ పడబోతున్నాయి.
SLBC Tunnel Collapse: SLBC టన్నెల్ లో 13 వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృత దేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో పాటు డీ వాటరింగ్ కొనసాగుతున్నాయి.
Crime News: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేష్ ను కర్రతో కొట్టి చంపేశాడు అతడి స్నేహితుడు నర్సింగ్.
Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు (మార్చ్ 6) మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.
Uttam Kumar Reddy: గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.