Meenakshi Natarajan: గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం ముగిసింది. ఇక, పని తీరు నివేదికలు ఇచ్చారు నేతలు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పని తీరు ఏంటని తెలుసు అన్నారు. పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు అని ఘాటుగా స్పందించింది. పార్టీ కోసం సమయం ఇవ్వండి.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించింది. నా పని తీరు నచ్చకపోయినా.. రాహుల్ గాంధీ.. సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చు అని పేర్కొన్నారు. కానీ, అంతర్గత విషయాలు బయట మాట్లాడకండి అని పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు.
Read Also: Stock Market: మార్కెట్‌కు సరికొత్త జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
అయితే, పార్టీలో నేతలను మూడు కేటగిరులుగా ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ విభజించారు. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్ళు ఒక గ్రూపుగా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ఒక గ్రూపుగా.. పార్టీ అధికారంలోకి వచ్చాకా పార్టీలోకి వచ్చిన వాళ్ళును మరో గ్రూపుగా విభజించింది. ఇక, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇంఛార్జ్ ఆలోచనలో ఉన్నారు.