Jana Reddy: కులగణన అంశంలో నా పాత్ర లేదు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గాలి మాటలు మాట్లాడితే కుదరదు అని పేర్కొన్నారు. యెస్తు క్రీస్తు.. చెప్పిన గుణాలు కలిగిన వాడ్ని నేను.. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం నాది.. నన్ను ఎవరు తిట్టిన నేను పట్టించుకోను.. ప్రత్యేక్ష రాజకీయాలకు నేను దూరం.. సలహాలు అడిగితే ఇస్తాను.. పరిపాలన చేసే వారు సైతం ఆడిగితేనే సలహాలు సూచనలు ఇస్తాను.. నన్ను విమర్శిస్తే నా పార్టీ నాయకులు ఖండిస్తలేరు… అలాగని సమర్ధించడం లేదు.. ఎందుకో వారినే అడిగి తెలుసుకోండి.. అలాగే, తెలంగాణలో కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని జానారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా ఆటగాళ్లు
అయితే, ఎవరో నాపై గాలి మాటలు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. నన్ను టార్గెట్ చేసిన వారిని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదన్నారు. ఇక, తెలంగాణకు వచ్చిన కొత్త కాంగ్రెస్ ఇంఛార్జ్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.. పార్టీ లైన్ దాటిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, గాంధీ భవన్ కి కొత్త ఇంఛార్జులు వస్తుంటారు.. ఇది కామన్ విషయమే అని పేర్కొన్నారు.