Karimnagar Graduate MLC: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ లో ఎలిమినేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 21 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 77,203 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇక, మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత ముందంజలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. కాగా, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సాధించాల్సిన 35 వేల 997 ఓట్లు అయితే, కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలంటే కావాల్సిన ఓట్లు 41 వేల 107.
Read Also: Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’
అయితే, రెండవ ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోటీ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సమానంగా వస్తుండటంతో.. ఓట్ల లెక్కింపు కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో ఫలితం కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఓట్ల లెక్కింపులో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ తర్వాత ఫలితం వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.