Madhu Yashki: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ ఎవరు దాటిన వారి పైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అన్నారు. నాకైనా, చిన్నారెడ్డి కైనా, రేవంత్ రెడ్డికి అయినా ఒకే చర్యలు ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలనుకున్న వారిలో మల్లన్న ఒకరు అని మధుయాష్కీ పేర్కొన్నారు.
Read Also: Minister Nadendla Manohar: పవన్ కల్యాణ్‌ని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి..?
ఇక, తీన్మార్ మల్లన్న లెవనెత్తుతున్న అంశాలపై వివరణ ఇవ్వాల్సింది కూడా రేవంత్ రెడ్డే అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ అన్నారు. అయితే, బీసీలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం జరుగుతుందని నేను అనుకోను.. మల్లన్న లెవనెత్తుతున్న అంశాలపై పీసీసీ కూడా క్లారిటీ ఇవ్వాలి అని కోరారు. కులగణన వ్యవహారంలో రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.