SBI Bank: వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఖాతాదారుల ఆందోళనకు దిగారు. 2024 నవంబర్ 19వ తేదీన బ్యాంకులో చోరీ ఘటనలో బంగారం పోగొట్టుకున్న బాధితులు నిరసన చేస్తున్నారు. బాధితులకు బంగారం విలువ కట్టిస్తానని చెప్పి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన బంగారానికి తరుగు తీసి డబ్బులు చెల్లిస్తామని బాధితులకు చెప్తున్న బ్యాంక్ అధికారులు.. చోరీ అయి మూడు నెలలు దాటిన నేటికీ ఒక్క బాధితునికి కూడా బంగారం డబ్బులను చెల్లించని బ్యాంక్ సిబ్బంది.
Read Also: Yami Gautam : నా వ్యక్తిగత విషయాల్లో రహస్యంగానే ఉంటాను..
అయితే, వాయిదాలు పెడుతూ బ్యాంక్ చుట్టూ తమను తిప్పుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మా బంగారానికి మార్కెట్ ధరను చెల్లించాలని బ్యాంక్ అధికారులను నిలదీశారు. 10 గ్రాముల బంగారానికి 77,710/- చెల్లిస్తామని బ్యాంక్ ఆధికారులు వెల్లడించారు. ఇక, బ్యాంకు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితులతో మాట్లాడి.. పరిస్థితిని చక్కదిద్దదానికి ప్రయత్నిస్తున్నారు.