China Support Pak: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో గతంలోనూ ఎన్నో సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నారు.. కానీ, అవి ఎంతో కాలం పని చేయలేదు.. కొద్ది రోజులకే పాక్ మళ్లీ కాల్పులకు దిగిందని పేర్కొంటున్నారు.
Pak Cyber Attack: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్‌పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాం, ఈ-మెయిల్ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’ అనే ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు ట్రై చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.
భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకు అయినా వెనుదిరిగేది లేదన్నారు. పాకిస్తాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.
Operation Sindoor Live Updates: సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేయడంతో.. భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది.
Terrorists Killed: ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన అబు జిందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా, మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని భారత భద్రతా దళాలు ప్రకటించాయి.
IND-PAK Tension: భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హైలెవల్ మీటింగ్ కొనసాగుతుంది.
High Alert In Taj Mahal: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ జారీ చేసింది. కీలకమైన ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచింది.
జమ్ముకశ్మీర్ లోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాకిస్తాన్ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది.
China: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా రియాక్ట్ అయింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.