Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువులో గల పాశమైలారం ఇండస్ట్రియల్ కారిడార్ లోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో సుమారు 45 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. ప్రమాదం జరిగి 48 గంటలు గడుస్తున్నప్పటికీ ఇంకా సిగాచి ఫ్యాకర్టీ యాజమాన్యం సంఘటన ప్రదేశానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాద ఘటనపై విచారణ చేసేందుకు నలుగురు నిపుణులతో కూడిన కమిటీని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది.
Read Also: Police High Alert: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అరెస్ట్.. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం..
ఇక, పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీపై దర్యాప్తుకు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి బి.వెంకటేశ్వర్ (ఏమిరేట్ సైంటిస్ట్) చైర్మన్‌గా, ప్రతాప్ కుమార్ చీఫ్ సైంటిస్ట్, డాక్టర్. సూర్యనారాయణ (రిటైర్డ్ సైంటిస్ట్), సంతోష్, సేఫ్టీ ఆఫీసర్ పూణె సభ్యులుగా కమిటీలో ఉంటారు. నెల రోజుల్లో దర్యాప్తు చేసిన ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల భద్రత కోసం సిగాచి కంపెనీ నిబంధనలు పాటిస్తుందా? లేదా? నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.