17 Days In 7 Rapes: బీజేపీ పాలిత రాష్ట్రమైన ఒడిశాలో మహిళలపై లైంగిక దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేవలం 17 రోజుల్లోనే ఏకంగా ఏడుగురు మహిళలు, బాలికలు అత్యాచారానికి గురవడం కలకలం రేపుతుంది. వరుస ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, తాజాగా జూలై 1న బర్గఢ్ జిల్లా భలుమారా అడవిలో మేకలు కాస్తున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో భజమాన్ భోయ్, సునంద పిహూ అనే నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also: Mohammad Shami : మొహమ్మద్ షమీకి షాకిచ్చిన హైకోర్ట్
గత 17 రోజులుగా జరిగిన ఏడు అత్యాచారాలు ఇవే..
* జూన్ 28వ తేదీన గంజాం జిల్లాలో 7వ తరగతి చదువుతున్న బాలికపై ఆమె దూరపు బంధువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు చేయడంతో 22 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* జూన్ 25వ తేదీన గంజార జిల్లాలో 17 ఏళ్ల యువతిపై ఓ క్లినిక్ యజమాని అత్యాచారం చేశాడు.
* జూన్ 19వ తేదీన మయూర్ భంజ్ జిల్లాలో ఆలయం నుంచి ఇంటికి వస్తున్న యువతిని నలుగురు సామూహిక అత్యాచారం చేశారు.
* జూన్ 18వ తేదీన కియోంఝర్ జిల్లాలో ఇంటికి సమీపంలో 17 ఏళ్ల బాలిక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
* జూన్ 15వ తేదీన గోపాల్‌పూర్ సముద్ర తీరంలో ఓ కాలేజీ విద్యార్థినిపై 10 మంది సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.