Vikram Misri: గత రాత్రి భారత నగరాలపై, పౌరులపై పాకిస్తాన్ ఉద్దేశపూర్వక దాడులు జరిపింది అని భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు.
Indian Govt: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాసింది కేంద్ర హోంశాఖ. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించుకోవాలని ఆ లేఖలో తెలిపింది.
Delhi On High Alert: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు భద్రతా దళాలు సైరన్ల ఏర్పాటు చేశారు. సైరన్లు మోగించి పౌరులను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ.
High Alert In Rajasthan: భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించారు. జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో లాంటి సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించబడింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరి కాసేపట్లో ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్ చేస్తున్నారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ రిహార్సల్స్ చేయనున్నారు. వైమానిక దాడుల సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు మోగనున్నాయి.
కాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ నిర్వహించిన సమావేశంలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో తాజాగా చర్చించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి రాజ్నాథ్ తీసుకెళ్లనున్నారు.
సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి ఇంట్లో ఈ కీలక సమావేశం జరిగింది.
ప్రధాని మోడీని, భారతదేశాన్ని నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తానంటూ మసూద్ అజహర్ లేఖలో ప్రస్తావించారు.
Ind-Pak Tensions To Impact IPL: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తామ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.