Collector Fish Cutting: చేపలను బోన్‌లెస్‌గా ఎలా కట్ చేయాలో చూపించిన కలెక్టర్!
- చేపలను బోన్‌లెస్‌గా కట్ చేసే విధానాన్ని చూపించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్..
- బోన్‌లెస్ చేపలను కట్ చేయడం వల్ల మార్కెట్ విలువ పెరుగుతుందని వెల్లడి..
- ఈ విధానం వల్ల మత్స్యకార కుటుంబాల ఆదాయం పెరగవచ్చు: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collector Fish Cutting: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలిసి చేపలను బోన్‌లెస్‌గా (ముళ్లు లేకుండా) తయారు చేసే విధానంపై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. ఈ విధంగా చేపలను బోన్‌లెస్‌గా తయారు చేయడం ద్వారా వాటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అందరు ఈ విధానం నేర్చుకోవడం ద్వారా మత్స్యకారులు, ఆదివాసీలతో పాటు చేపలపై ఆధారపడి జీవించే కుటుంబాలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందన్నారు. బోన్‌లెస్ చేప ముక్కలను పిల్లలు, పెద్దలు సులభంగా తినగలిగే విధంగా ఉండటంతో మంచి పోషకాహారం అందించే ఛాన్స్ ఉంటుందని వివరించారు. ఇక, బోన్‌లెస్ చేప ముక్కల ద్వారా చికెన్ టిక్కా లాంటి రకరకాల వంటకాలు, ఐటమ్స్ తయారు చేసి చేపలకు కొత్త విలువ చేర్చవచ్చని తెలిపారు. తద్వారా చేపలను తినే ప్రజలకు కొత్త రుచులు అందించడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవడం సాధ్యమవుతుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు.
Read Also: Off The Record: త్వరలో ప్రభుత్వ విప్ పదవుల భర్తీ..
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
అలాగే, చేపల తలలు, మిగిలిన భాగాలతో పోషక విలువ గల రుచికరమైన సూప్ తయారు చేసి జిల్లా వాసులకు అందించడం ద్వారా ఆరోగ్యం, ఆదాయం రెండూ సంపాదించుకోవచ్చునని, అలాగే మిగిలిన వ్యర్థాలను ఎరువుగా వాడటం ద్వారా పర్యావరణం పరిరక్షణతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని వెల్లడించారు. ఈ ప్రయత్నం ద్వారా మత్స్యకారులు, ఫిష్ వ్యాపారులు, SHG మహిళలు తమ సామర్థ్యాన్ని పెంచుకొని, ఆరోగ్యకరమైన ఆహారం అందించడంతో పాటు ఆదాయ మార్గాలను కూడా విస్తరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రోత్సహించి మరిన్ని కుటుంబాలు లబ్ధిపొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!